Header Banner

ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం భేటీ! పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులపై..

  Sat May 24, 2025 22:17        Politics

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీతి ఆయోగ్ సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులపై ఆయన ప్రధానికి వినతి పత్రాలు అందజేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు. సమావేశంలో భాగంగా హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణకు సంబంధించిన అనుమతులను వీలైనంత త్వరగా మంజూరు చేయాలని రేవంత్ రెడ్డి ప్రధానిని అభ్యర్థించారు. ఈ విషయంలో పట్టణాభివృద్ధి శాఖకు తగిన ఆదేశాలు జారీ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు వ్యూహాత్మకమైన రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర, దక్షిణ భాగాలకు ఒకేసారి ఆర్థిక, మంత్రివర్గ అనుమతులు ఇవ్వాలని కోరారు. ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగానికి అవసరమైన భూసేకరణ ఖర్చులో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వమే భరించడానికి సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అంతేకాకుండా ఆర్‌ఆర్‌ఆర్‌కు సమాంతరంగా ఒక గ్రీన్‌ఫీల్డ్‌ రైల్వే లైన్‌ను నిర్మించే ప్రతిపాదనకు కేంద్రం సహకరించాలని రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్రంలో వాణిజ్య, రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా హైదరాబాద్ సమీపంలో ఒక డ్రై పోర్టును ఏర్పాటు చేయాలనే ఆలోచనను కూడా ఆయన ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. ఈ డ్రై పోర్టును మచిలీపట్నం పోర్టుతో అనుసంధానించేందుకు ప్రత్యేకంగా గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు మార్గంతో పాటు గ్రీన్‌ఫీల్డ్‌ రైల్వే లైన్‌ను కూడా ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

 

ఇది కూడా చదవండి: విజయవాడ విమానాశ్రయానికి మహర్దశ! ఇక నుండి అక్కడికి డైరెక్ట్ సర్వీసులు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కారు ప్రమాదంలో మాజీమంత్రి మనవరాలి మృతి! మరో ఇద్దరు మహిళలు తీవ్రంగా..

 

రెండు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌.. రేపు, ఎల్లుండి పొంచివున్న ముప్పు! భారీ నుంచి అతి భారీవర్షాలు!

 

విజయవాడలో హైఅలర్ట్.. బాంబు బెదిరింపులతో నగరంలో కలకలం!

 

ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం.. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో చంద్రబాబు భేటీ!

 

హార్వర్డ్‌కు ట్రంప్ సర్కార్ షాక్! అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశంపై నిషేధం!

 

గోల్డ్ లవర్స్ ఇక కొనేసేయండి..! బంగారం ధర తగ్గిందోచ్.. ఎంతంటే.?

 

వైసీపీ మాజీ మంత్రికి అష్టదిగ్బంధన! లుక్ అవుట్ నోటీసులు జారీ!

 

వామ్మో.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. దెబ్బకు మళ్లీ లక్షకు చేరువలో!

 

స్కూల్ బస్సుపై సూసైడ్ బాంబ్! నలుగురు చిన్నారులు స్పాట్.. 38 మందికి సీరియస్!

 

జగన్‌ను కోర్టుకు రప్పిస్తా! అప్పటి వరకు నిద్రపోను!

 

విజయవాడలో మరో ఇంటిగ్రేటెడ్‌ బస్​ టెర్మినల్‌..! పీఎన్‌బీఎస్‌పై తగ్గనున్న ఒత్తిడి!

 

ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?

 

ఖరీఫ్ సాగు లక్ష్యంగా మంత్రి అచ్చెన్న కీలక మార్గదర్శనం! రైతు సంక్షేమమే టార్గెట్!

 

టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!

 

ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Hyderabad #RevaParty #Polices